సౌతిండియా సినిమాలపై ఇటీవలికాలంలో బాలీవుడ్ వాళ్లకు ఫోకస్ పెరిగింది. బాలీవుడ్ కథలను రీమేక్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. గతంతో పోల్చితే సినిమా రంగంలో సౌతిండియా – నార్త్ ఇండియా మధ్య గ్యాప్ బాగా తగ్గింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ పై మరింత రెస్పెక్ట్ పెరిగింది.

Image result for VARUN DHAWAN

తెలుగు లేదా తమిళ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఈ రెండు భాషల్లోని పలు సినిమాలు హిందీలోకి డబ్ అవడమో, రీమేక్ అవడమో జరిగాయి. రీమేక్ కాని సినిమాలు డబ్ తో బాక్సాఫీస్ కలెక్షన్లు కురిపించాయి. బాహుబలి తర్వాత రాజమౌళికి, అంతకుముందు నుంచే మణిరత్నం, శంకర్ లాంటి వాళ్లకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు వాళ్ల సినిమాల్లో నటించేందుకు చాలా మంది బాలీవుడ్ స్టార్స్ రెడీగా ఉన్నారు.

Image result for rajamouli

          అక్టోబర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ ధావన్ .. రాజమౌళి, శంకర్ సినిమాల్లో నటించాలని ఉందన్నాడు. రాజమౌళి తీసిన బాహుబలి, శంకర్ తీసిన రోబో లాంటి సినిమాలు సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని పెంచాయని వరుణ్ చెప్పాడు. వాస్తవానికి తాను తెలుగులో లేదా తమిళంలో ఇంట్రడ్యూజ్ అవ్వాలనుకున్నట్టు చెప్పి ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్ తనకు మంచి ఫ్రెండ్ అన్న వరుణ్ ధావన్.. తెలుగు నేర్చుకోవాలని చెర్రీ సూచించినట్టు చెప్పాడు.

Image result for ram charan

          వరుణ్ ధావన్ నటించిన అక్టోబర్ సినిమా ఇటీవలే రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ వరుణ్ సూయీ ధాగా అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. మేకిన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. అనుష్క శర్మ ఇందులో హీరోయిన్. మరి వరుణ్ ధావన్ తెలుగులో ఎప్పుడు నటిస్తాడో.. తన కోరిక ఎప్పుడు తీర్చుకుంటాడో చూడాలి మరి.!  


మరింత సమాచారం తెలుసుకోండి: