ప్రముఖ నటి ఇలియానా తల్లి కాబోతోందా? అంటూ బీటౌన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గత కొంత కాలంగా ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఇలియానా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ, ‘హబ్బీ’ (భర్త) అని సంబోధిస్తుంటుంది. టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో రామ్ సరసన ఇంట్రడ్యూజ్ అయింది గోవా బ్యూటీ ఇలియానా . కుర్రకారు గుండెలు కొల్లగొట్టేసింది .
Image result for ilianan raid moveis
టాలీవుడ్‌లో ఫ‌స్ట్ కోటి రూపాయిల పారితోష‌కం తీసుకున్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చ‌కుంది ఇలియానా. గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ తో ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఇలియానా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేస్తూ, ‘హబ్బీ’ (భర్త) అని కామెంట్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఇపుడు ఇలియానా తల్లి కాబోతున్నారని తాజా రూమర్‌.
Image result for ileana hot
అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో కలిసి రైడ్ చిత్రంలో కథానాయిక‌గా న‌టించింది ఇలియానా. ఇటీవ‌లే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. దీంతో సినిమా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇలియానా, తాను గర్భం దాల్చిన సంగతి బయటపడకుండా ఉండేందుకు లూజు, తేలికైన డ్రస్సుల్లో కనిపిస్తున్నారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
Image result for ileana hot husband
అంతే కాకుండా ఆండ్రూ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో తన భార్య ఫొటోను షేర్‌ చేశాడు. ఆ ఫొటోలో ఇలియానా బాత్‌ టబ్‌ లో కాఫీ తాగుతూ సేదదీరుతోంది. ఆ ఫొటోకు ఆండ్రూ, ‘ఇలియానా ఏకాంతంగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: