సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయే 3 సినిమాల వివరాలను అందించాడు. భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ తన తర్వాత సినిమాల లిస్ట్ ఎనౌన్స్ చేశాడు.


మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రాబోతుంది. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి ఆ సినిమా నిర్మిస్తున్నారు. ఇక దాని తర్వాత అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగాతో ఓ సినిమా ఉంటుందని అన్నాడు. ఆ సినిమా కథ చెప్పగానే తనకు నచ్చేసిందని తప్పకుండా అది మంచి సినిమా అవుతుందని అన్నారు  మహేష్.


ఇక ఈ రెండిటి తర్వాత సుకుమార్ డైరక్షన్ లో మరో సినిమా ఉంటుందని చెప్పాడు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో 1 నేనొక్కడినే సినిమా వచ్చింది. అయితే రంగస్థలం సూపర్ హిట్ కొట్టడంతో సుకుమార్ కు మహేష్ నుండి పిలుపొచ్చింది. అయితే వంశీ, సందీప్ సినిమాల తర్వాతే సుక్కు సినిమా ఉంటుందని తెలుస్తుంది.


ఇక ఈ 3 సినిమాల తర్వాత ఏమన్నా ఉంటే రాజమౌళి సినిమా ఉండొచ్చు. చాలా రోజులుగా మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీపై వార్తలు వస్తున్నా అది మాత్రం ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదు. మహేష్ మాత్రం భరత్ తర్వాత కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: