బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి అంటే 90వ దశకంలో విపరీతమైన క్రేజ్ ఉండేది.  రాక్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో డిస్కో పాటలకు గొప్ప సంగీతం అందించారు.   ఒక రకంగా చెప్పాలంటే..హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతమును పరిచయము చేసిన ఘనత ఈయనకే దక్కుతుంది.  మిథున్ చక్రవర్తి కి ఎంతో పేరు తీసకు వచ్చిన సినిమా డిస్కో డ్యాన్సర్ లో అన్ని పాటలు ఇప్పటికీ బాలీవుడ్ లో మారుమోగిపోతుంటాయి.
Bappi Lahari.jpg
ఉషా ఉత్తప్ప, బప్పీ లహరి కాంబినేషన్లో ఎన్నో డిస్కో పాటలు వచ్చాయి. అయితే బప్పీలహరి రాక్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు..మంచి సింగర్ కూడా..ఆయన స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది.  అధికంగా నగలు వేసుకోవడం అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.  తాజాగా బప్పీలహరి ఇటీవల యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో బప్పీలహరి కనీసం ఒక్క నగ కూడా ధరించకుండా కనిపిస్తున్నారు.

ఆయన ఇలా కనిపించడం ఇది తొలిసారి. దీంతో నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోయారు..బప్పీలహరి ఎంతో నిండుగా కనిపించేవారు..కానీ బోసిగా మారారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సమాధానంగా ‘బంగారం లేకుండా ఎలా నిశ్చింతగా ఉండగలను? నేనూ అదే ఆలోచిస్తున్నాను... నా బంగారం ఏమైంది?’ అని ప్రశ్నిస్తున్నారు.
Image result for bappi lahiri
ఏదిఏమైనా, బప్పీలహరి బంగారం ఏమైందో తెలియకపోయినా... బంగారం లేకుండా బప్పీలహరిని చూసే భాగ్యం అందరికీ దక్కింది. కాగా, తెలుగులో ఆయన ‘సింహాసనం’, ‘రౌడీగారి పెళ్లం’, ‘రౌడీ అల్లుడు’, ‘బిగ్‌బాస్’, ‘గ్యాంగ్ లీడర్’తో పాటు పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: