రామ్ గోపాల్ వర్మ ఇన్నాళ్లు ట్విట్టర్ లో ఏది పడితే అది రాసే వాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడే వాడు. ఒక నొక స్టేజ్ లో అస్సలు వర్మను పట్టించుకోవద్దు అనే విధంగా చాలా మంది మాట్లాడినారు. అయితే ఇన్నాళ్లు వర్మ ఏం మాట్లాడాడిన పెద్ద గా మాట్లాడని ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మీద వర్మ చేయించిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ లో  దుమారం రేపుతున్నాయి. వర్మ మీద అల్లు అరవిందు చేసిన వ్యాఖలే అందుకు నిదర్శనాలు. 

Image result for ram gopal varma

ఈసారి వర్మ చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. అది ఎంత పెద్ద తప్పంటే, తను తప్పు చేశానని వర్మ బహిరంగంగా క్షమాపణలు కోరినప్పటికీ, క్షమించరాని నేరం. ఈసారి ఈ దర్శకుడు దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ప్రస్తుతం అతడి చుట్టు గట్టిగా ఉచ్చు బిగిస్తోంది. విషయం ఎంతవరకు వెళ్లిందంటే, వర్మను పరిశ్రమ నుంచి వెలి వేయాలని డిమాండ్ చేసేంత. ఇదే విషయాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ప్రస్తావించారు. వర్మ లాంటి నీచుడ్ని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

Image result for ram gopal varma

"ఇండస్ట్రీలో ఈరోజు అంతా సిగ్గుతో తలదించుకున్నారు. వర్మ పాత్ర ఇందులో స్పష్టంగా ఉందనే విషయం ఇండస్ట్రీకి తెలిసింది. మరి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తారు. అంతా కలిసి ఈ వివాదాన్ని ఏం చేస్తారనే విషయాన్ని పక్కనపెడితే, ఇటువంటి నీచుడ్ని ఏం చేస్తారో చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి వాళ్లు పరిశ్రమలో ఎందుకు ఉండాలి? దీనిపై నిర్ణయాన్ని ఇండస్ట్రీకే వదిలేస్తున్నాను." అయితే వర్మను ఇండస్ట్రీ నుంచి తరిమేయడం అంత ఈజీ కాదనే విషయాన్ని కూడా అల్లు అరవింద్ చెబుతున్నారు. కాంపిటిషన్ కమిషన్ అనేది ఒకటుందని, ఎవరూ ఎవర్ని నిషేధించలేరని అన్నారు. అయితే పరిశ్రమలో పెద్దలంతా ఒకటైతే అనధికారికంగా అయినా వర్మను పక్కనపెట్టొచ్చని అంటున్నారు అరవింద్.



మరింత సమాచారం తెలుసుకోండి: