సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ సిఎంగా పొలిటికల్ ఎవేర్ నెస్ తో వచ్చిన ఈ సినిమాలో మహేష్ నటనకు అందరు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మీడియా గురించి మహేష్ ప్రీ క్లైమాక్స్ లో చెప్పిన స్పీచ్ అదిరిపోయిందని అంటున్నారు.


ఈ సినిమా మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చాడు. మహేష్ ను అన్నా అంటూ చెప్పుకొచ్చిన తారక్ మహేష్ అన్న ఓ అరుదైన రకం అనేశాడు. ప్రయోగాలు చేస్తూ స్టార్ డం కొనసాగిస్తున్న మహేష్ కు ఈ భరత్ అనే నేను హిట్ కంపల్సరీ అయ్యింది.


అనుకున్నట్టుగానే భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ఆడియెన్స్ కూడా నిజంగానే ఇలాంటి సినిమా అది ఓ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చేయాలంటే కచ్చితంగా గట్స్ ఉండాల్సిందే అని చెప్పుకుంటున్నారు. ఇక శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ఫ్లాపులతో సతమతమవుతున్న మహేష్ ఫ్యాన్స్ భరత్ సినిమాతో ఆకలి తీర్చుకుంటున్నారు.


మొత్తంగా సినిమా మరోసారి మహేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసేట్టుగా వచ్చింది. యూఎస్ లో అత్యధికంగా 2000 ప్రీమియర్స్ షోస్ వేసిన ఈ సినిమా మొదటి రోజే భారీ రేంజ్ లో వసూళ్లను రాబట్టగలదని అంటున్నారు. మరి మహేష్ భరత్ అనే నేను సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: