సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ ఘన విజయం సాధించింది.  మార్చి 31 న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతూ వస్తుంది.  ఓవర్సీస్ లో కూడా రాంచరణ్ రికార్డులు క్రియేట్ చేశారు.  బాహుబలి తర్వాత ఆ తరహా కలెక్షన్ల పరంగా రికార్డు బ్రేక్ చేసిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. 
Image result for rangasatlam
ఈ నెల నితిన్ నటించిన ఛల్ మోహన రంగ, నాని నటించిన ‘కృష్ణార్జున యుద్దం’ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రంగస్థలం జోరు మరింత పెరిగిపోయింది.  తమిళనాట కూడా బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది రంగస్థలం.  ఇదిలా ఉంటే `భ‌ర‌త్ అనే నేను` త‌మిళ‌నాడులో రిలీజ‌వుతుందా? అవ్వ‌దా? అన్న సందిగ్ధత చాలాకాలంగా నెల‌కొంది. 
Image result for rangasatlam
గత 48రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన కోలీవుడ్ బంద్‌ ఇప్ప‌ట్లో తేల‌ద‌ని భ‌య‌ప‌డ్డారంతా.  అనూహ్యంగా బంద్ ఎత్తేయ‌డంతో భ‌ర‌త్‌కి లైన్ క్లియ‌రైంది. ఆ క్ర‌మంలోనే నిన్న‌టిరోజున తెలుగు రాష్ట్రాలు స‌హా, త‌మిళ‌నాడులోనూ `భ‌ర‌త్ అనే నేను` అత్యంత క్రేజీగా రిలీజైంది. ఇక తమిళనాట మహేష్ కి మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘భరత్ అనే నేను’డే1 బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న టాక్ వినిపించ‌డంతో భ‌ర‌త్ అనే నేను వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది.
Image result for rangasatlam
ఓ అంచ‌నా ప్ర‌కారం ఈ సినిమా తొలిరోజు 50 కోట్ల గ్రాస్‌, 33కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. చెన్నైలో రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం`-25ల‌క్ష‌లు, ప‌వ‌న్ `ఆజ్ఞాత‌వాసి` -24ల‌క్ష‌లు వ‌సూలు చేస్తే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ భ‌ర‌త్ అనే నేను డే-1 లో 27ల‌క్ష‌లు వ‌సూలు చేసింది.  కథలో మంచి పట్టు ఉండటం..మహేష్ బాబు అద్భుత నటనకు తెలుగు, తమిళ అభిమానులు ఫిదా అయ్యారని..అందువ‌ల్ల‌నే ఈ రికార్డు సాధ్య‌మైంద‌ని ట్రేడ్ నిపుణుడు ఎల్‌.ఎం.కౌశిక్ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: