ఎప్పుడు లేనిది మహేష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చాడు. తాను గెస్ట్ గా కాదు కుటుంబ సభ్యుడిగా వచ్చాడని చెప్పినా ఓవరాల్ గా రిలీజ్ తర్వాత భరత్ చేస్తున్న హంగామాకు పరోక్షంగా ఎన్.టి.ఆర్ కూడా ఓ రీజన్ అయ్యాడు. అంతేకాదు తమ హీరో ప్రీ రిలెజ్ కు వచ్చాడు కాబట్టి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ లేకుండా చేశారు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్.


ఈమధ్య కాలంలో ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ మరింత దిగజారుడు తనంగా కనిపిస్తున్నాయి. ఇది స్టార్ సినిమాల ఫలితాల మీద ప్రభావితం చేస్తుంది. అందుకే నందమూరి, ఘట్టమనేని ఫ్యాన్స్ మధ్య దూరాన్ని దగ్గర చేశారు మహేష్, ఎన్.టి.ఆర్. అందుకే వచ్చిన పాజిటివ్ టాక్ మరింత బలంగా మారింది.


ఇక మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భరత్ అనే నేను సినిమాకు సపోర్ట్ చేస్తుండటం విశేషం. సినిమాలో ప్రెస్ మీట్ ఎపిసోడ్ పవన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. దాన్ని ఉదహరణగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా మహేష్ ప్రెస్ మీట్ ఎపిసోడ్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.


మొత్తానికి అటు ఎన్.టి.ఆర్ ప్రీ రిలీజ్ కు రాగా సినిమాలో యువనేతగా పవన్ ను గుర్తుచేసి మహేష్ భరత్ అనే నేను సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా వసూళ్ల లెక్క చూస్తుంటే మళ్లీ మహేష్ నాన్ బాహుబలి రికార్డులన్ని తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు. మహేష్ సిఎంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: