భారత దేశంలో ప్రజలు ఇంత సుభీక్షంగా ఉన్నారంటే..బార్డర్ లో మన సైనికులు నిరంతరం తమ ప్రాణాలు సైతం లేక్కచేయకుండా పహారా కాస్తున్నందువల్లే అని అందరికీ తెలిసిన విషయమే.  అయితే మిలటరీలో చేరాలంటే..చాలా మంది కాస్త ఆలోచిస్తుంటారు..కానీ కొన్ని ప్రాంతాల్లో మిలటరీలో చేరడానికే తమ జీవితం అన్నట్లు ఉంటారు. అలాంటి ఊరే ఆంధ్రప్రదేశ్ లోని మిల‌ట‌రీ మాధ‌వ‌రం..అవును వాస్తవానికి ఆ ఊరిపేరు మాధవపురం..కానీ అక్కడ దాదాపు ప్ర‌తి ఇంటి నుంచీ ఒక‌రు ఆర్మీలో ప‌నిచేస్తున్నారు.
Related image
త్రివిధ ద‌ళాల్లో ప‌నిచేసే వారిని అందించిందా గ్రామం. అందుకే ఆ ప‌ల్లెకు మిల‌ట‌రీ అనే ట్యాగ్ జ‌త చేరింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు మారుమోగుతుంది..ఎందుకో తెలుసా..! స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన  `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ఆడియో రిలీజ్ వేడుక జ‌రిగింది ఈ ఊరిలోనే జరిగింది.  వాస్తవానికి ఈ ఊరి గురించి బన్నికి కూడా పెద్దగా తెలియదట..కానీ దర్శకులు వక్కంతం వంశి చెప్పడంతో ఆశ్చర్యపోయారట..ఇంత గొప్ప ఊరిలో మన సినిమాకు సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తే మనకే గర్వంగా ఉంటుందని చెప్పడంతో ఆడియో రిలీజ్ వేడుక జ‌రిగింది ఆ ఊరిలోనే చేశారు.

ఆడియో ఫంక్ష‌న్ పూర్త‌యిన త‌రువాత గ్రామంలో ప‌ర్య‌టించారు అల్లు అర్జున్‌.దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు తన వంతు సహాయం అందించారు.

అంతే కాదు దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన గొప్ప వీరయోధులను కన్నారమ్మ అంటూ అల్లు అర్జున్ కొంత మంది వృద్దల పాదాభివందనం చేశారు. మే 4వ తేదీన విడుద‌ల కాబోతున్న ఈ సినిమాతో ర‌చ‌యిత వక్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్.



మరింత సమాచారం తెలుసుకోండి: