సిఎం వైఖరికి నిరసనగా పవన్ కళ్యాణ్ అబిమాని ఒకరు నిరాహారదీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాడు. పవన్ కు అభిమానుల సంఖ్య ఎంతో ఎక్కువ, వారిలో ఎవరని ఎలా తెలుసుకుంటాం అనుకుంటున్న వారికి ఆయనెవరో తెలుసుకోవడం కష్టం కాదు. ఎందుకంటే ఆ అభిమాని కూడా ఓ సూపర్ హీరోనే.

ఆయనెవరో కాదు తమిళంలో అదరగొడుతున్న హీరో విజయ్,  అయితే పవన్ కోసం తమిళ హీరో ఎందుకు నిరాహార దీక్ష చేస్తాడు అన్న అనుమానం కూడా మీకు కలగడం సహజం. అది కూడా పవన్ సినిమా అత్తారింటికి దారేది సినిమా విడుదల వాయిదా పడుతుండడంపై అని కూడా అనుకుంటారు, కారణం ఇప్పుడు పవన్ అభిమానులను కలవరపెడుతున్నది అదే కాబట్టి.

అయితే ఈ పవన్ అభిమాని అయిన తమిళ హీరో విజయ్ ఈ దీక్ష చేయాలనుకుంటున్నది పవన్ కళ్యాణ్ కోసం కాదు, తన కోసం, తనను కష్టపెడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాడట. కారణం తన తలైవా సినిమా విడుదలకు జయలలిత ఎక్కడలేని కష్టాలు పెడుతోందట.. ఇప్పుడర్థం అయిందనుకుంటా అసలు విషయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: