బాలీవుడ్ అగ్ర తారలు సునీల్ దత్, నర్గీస్ ముద్దుల తనయుడు సంజయ్ దత్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘రాఖీ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే రీల్ లైఫ్ లో కన్నా రియల్ లైఫ్ లో సంజయ్ దత్ ఎన్నో కష్టాలు పడ్డాడు. తండ్రి ఒక గొప్ప సినీ నటుడు, రాజకీయ నాయకుడు అయినప్పటికీ సంజయ్ దత్ విషయంలో ఒకనొక దశలో ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారని అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. 

సంజయ్ దత్ ఒక సెలబ్రెటీ హోదాలోనే కాకుండా..సామాన్యుడిగా సాధారణ జైలు జీవితం కూడా అనుభవించాడు. గత సంవత్సరం తన జైలు జీవితానికి గుడ్ బాయ్ చెప్పాడు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సంజ‌య్ ద‌త్ గా ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టిస్తున్నాడు..  రాజ్‌కుమార్ హిరాని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్ తోపాటు , సోన‌మ్‌క‌పూర్‌, ప‌రేశ్ రావెల్, మ‌నీషాకొయిరాల‌, అనుష్కాశ‌ర్మ‌, క‌రిష్మా త‌న‌, జిమ్ స‌ర‌బ్ న‌టిస్తున్నారు.

ఈ మూవీకి సంగీతం ష్నాత‌ను మోయిత్ర‌, అమ‌ల్ మాలిక్  లు అందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కానుంది.సంజ‌య్ ద‌త్ కేరీర్ ఆరంభం నుంచీ అత‌ను జైలు పాల‌య్యేంత వ‌ర‌కూ ప‌లు అంశాల‌ను ఇందులో స్పృశించారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ అచ్చు సంజ‌య్‌ద‌త్‌లాగే క‌నిపిస్తున్నారు. ప్ర‌త్యేకించి- మున్నాభాయ్ గెట‌ప్‌తో పాటు పుణే య‌ర‌వాడ జైలులో ఖైదీ దుస్తుల‌తో సంజ‌య్‌ద‌త్ స్వ‌యంగా వ‌చ్చి న‌టించాడ‌నే ఫీల్ క‌లిగిస్తోందీ మూవీ.

సంజ‌య్‌ద‌త్ తండ్రి సునీల్ ద‌త్‌గా ప‌రేష్ రావెల్‌, త‌ల్లి న‌ర్గీస్ ద‌త్‌గా మ‌నీషా కొయిరాలా, భార్య మాన్య‌త‌గా దియా మీర్జా, స్నేహితుడు, న‌టుడు కుమార్ గౌర‌వ్ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్‌, టీనా మునీమ్‌గా సోన‌మ్‌క‌పూర్‌, స‌ల్మాన్‌ఖాన్‌గా జిమ్ శ‌ర్భ‌, మాధురి దీక్షిత్‌గా క‌రిష్మా ట‌న్నా న‌టిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: