టాలీవుడ్‌లో క్యాస్ట్ కౌచింగ్ వ్య‌వ‌హారం చివ‌ర‌కు రాజ‌కీయ రంగు పుల‌ముకున్న సంగ‌తి తెలిసిందే. మీడియాను కూడా ఈ వ్య‌వ‌హారంలోకి లాగింది శ్రీరెడ్డి. ప‌వ‌న్‌, ఆయ‌న త‌ల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను కొన్ని టీవీ ఛాన‌ల్లు ప‌దే ప‌దే ప్ర‌సారం చేయ‌డంపై ప‌వ‌న్ తీవ్రంగా మండిప‌డ్డారు.మీడియాకు తెలియకుండా అత్యంత గోప్యత మధ్య జరిగిన ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి వెంకటేష్‌, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్‌, వరుణ్ తేజ్‌, నాగచైతన్య, నాని, అల్లరి నరేష్‌, రామ్‌, సుమంత్‌, జీవిత-రాజశేఖర్‌,నవదీప్‌, లక్ష్మీ ప్రసన్న, సీనియర్ నరేష్‌ తదితరులు హాజరయ్యారు.  ఎల్లోమీడియాపై ప‌వ‌న్ తిరుగుబాటు ఎగ‌ర‌వేసిన సంగ‌తి తెలిసిందే.
tollywood top heros secret meeting in annapurna studio?
టీవీ9, ఏబీఎన్‌, టీవీ 5ఛాన‌ల్ల‌ను టార్గెట్ చేస్తూ ప‌లు సంచ‌ల‌న ట్వీట్‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంకో అడుగు ముందుకేసి ఎల్లోమీడియాను బ‌హిస్క‌రించండంటూ అభిమానుల‌కు ప‌వ‌న్ పిలుపు నిచ్చారు. అయితే ఈ వ్య‌వ‌హారాన్ని సీనీ ఇండ‌స్ట్రీ సీర‌య‌స్‌గా తీసుకుంది. ఇండస్ట్రీలోని మహిళలను టీవీ5 యాంకర్ అసభ్య పదజాలంతో దూషించినా …ఇండస్ట్రీని కించపరిచేలా కార్యక్రమాలు ప్రసారం చేసినా ఇండస్ట్రీ తరఫు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంపై పవన్ గుర్రుగా ఉన్నారు.

మరో వైపు, గత శనివారం పవన్ కల్యాణ్ సూచన మేరకు టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌ పై జరుగుతున్న రగడ గురించి చర్చించుందుకు 24 క్రాఫ్ట్స్‌ కు చెందిన సినీ పెద్దలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు సమావేశాలు ముగిశాక మీడియాతో మాట్లాడటానికి సినీ పెద్దలు ఆసక్తి చూపలేదు.   
Image result for tollywood heros
మ‌రి ఈస‌మావేశంలో ప‌వ‌న్ లేవ‌నెత్తిన అంశాల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారేది ఆస‌క్తిక‌రంగా మారింది. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ గురించి ఎప్పటికప్పుడు తీవ్రంగా దుష్ఫ్రచారం చేస్తున్న తెలుగు న్యూస్ ఛానళ్లు ను దూరం పెట్టాలనే విషయంపై ఈ సమావేశంలో అగ్రహీరోలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: