టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సినీ తారల బయోపిక్ సిమాలు వరుసగా వస్తున్నాయి.  ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ వస్తుంది. అలనాటి మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ సినిమా తీస్తున్నారు.  ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తుండగా..బాలకృష్ణ ఆయన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్నారు.  ప్రస్తుతం నటీ నటుల సెలక్షన్ అవుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ముహూర్తం మొదలు పెట్టి..ఈ నెల 29 రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతున్న సమయంలో దర్శకులు తేజ ఒక్కసారే షాక్ ఇచ్చారు.   

ఇక ఇంత అర్థంతరంగా తేజ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎందుకు వదిలేశారన్న చర్చ సాగుతున్న వేళ, సినీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. తాను ఏ సినిమాలో నటిస్తున్నా, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చే హీరో బాలకృష్ణ, తేజ మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.  ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సాంగ్ ‘ఆకు చాటు పిందె తడిసే’ వేటగాడు సినిమాలోనిది..ఈ పాట ఉండాలని..అంతే కాకుండా జయలలితతో ఎన్టీఆర్ చేసిన ఓ హిట్ డ్యూయెట్ ఈ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని బాలకృష్ణ చెబితే, అందుకు తేజ అంగీకరించలేదని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.   
Image result for ntr biopic
ఎన్టీఆర్ జీవిత చరిత్ర చిత్రంలో 50 గెటప్పులను బాలయ్య ఫైనల్ చేయగా, వాటి మధ్య డ్యూయెట్లు పెడితే కథ లో పట్టు కోల్పోతామని..సినిమాపై ప్రభావం చూపుతుందని తేజ అభిప్రాయ పడ్డారట. దాంతో పాటు బాలయ్య ఫైనల్ చేసిన గెటప్స్ ఆయన ఫిజిక్ కు సూట్ కావని కాడా తేజ చెప్పాడని సమాచారం.తన స్క్రిప్టులో జోక్యం చేసుకోవడాన్ని ఇష్టపడని తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
Related image
ఇక తేజ తప్పుకోవడానికి మరో వర్షన్ ఏంటంటే, మే నెలలో 15 రోజుల షూటింగ్, ఓ సాంగ్ ను చిత్రీకరించాలని బాలయ్య కోరగా, చాలా హోమ్ వర్క్ చేయాల్సిన ప్రాజెక్టు కాబట్టి వెంటనే షూటింగ్ సాధ్యం కాదని తేజ తేల్చి  దాంతో బాలయ్యకు చిర్రెత్తుకొచ్చినట్లు..వారి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో తేజ తప్పుకున్నట్లు సినీ వర్గాల టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: