టాలీవుడ్ లో ఆ మద్య శ్రీరెడ్డి లీక్స్ అంటూ ప్రకంపనలు సృష్టించి..కాస్టింగ్ కౌచ్ పై దుమారం లేపిన నటి శ్రీరెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు ఎంతో అన్యాయం అవుతుందని..సినిమా ఛాన్స్ ల కోసం వస్తే..లైంగికంగా వేధించడం..చాన్స్ లు ఇప్పిస్తామని శారీరకంగా వాడుకోవడం లాంటివి చేస్తున్నారని..అలా తమను తాము అర్పించుకున్నా..సినిమా చాన్సులు వస్తాయో రావో అన్న పరిస్థితి నెలకొందని ఆరోపిస్తూ వచ్చింది.  శ్రీరెడ్డి పోరాటానికి ఆ మద్య కొంత మంది సినీ సెలబ్రెటీలు, మహిళా సంఘాలు మద్దతు ఇచ్చాయి. 
Related image
ఇదే సమయంలో శ్రీరెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై కామెంట్ చేయడంతో వ్యవహారం కాస్త ఎటో వెళ్లి పోయింది.  శ్రీరెడ్డి విషయంలో రాంగోపాల్ వర్మ జోక్యం చేసుకోవడం..తర్వాత పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.  ఇదిలా ఉంటే తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నటి శ్రీరెడ్డితో సినిమా తీసేందుకు తాను సిద్ధమేనని అని అన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్... మెగా ఫ్యామిలీతో కలిసి ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లడం, తదనంతర పరిణామాల తర్వాత ఆర్జీవీ మళ్లీ పవన్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నాడు.
Image result for pawan kalyan film chamber
క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్జీవీ.. పవన్ కళ్యాణ్‌ను లక్ష్యం చేసుకుని మాట్లాడమని చెప్పింది తానేనంటూ మరో వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే.  ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి గురించి మాట్లాడుతూ.. ‘‘తగిన పాత్ర ఉంటే ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తా’’ అని వెల్లడించారు.క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్... మెగా ఫ్యామిలీతో కలిసి ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లడం, తదనంతర పరిణామాల తర్వాత ఆర్జీవీ మళ్లీ పవన్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నాడు.
Image result for ram gopal varma
పవన్ కళ్యాణ్‌ను దూషించిన తర్వాత లీకైన శ్రీరెడ్డి - జూనియర్ ఆర్టిస్టు తమన్నా ఫోన్ కాల్‌లో ఆర్జీవీయే పవన్‌ను తిట్టించాడని శ్రీరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై శ్రీరెడ్డి కూడా గుర్రుగా ఉంది. అయితే, ఆర్జీవీ మాత్రం ఇంకా శ్రీరెడ్డికి మద్దతుగానే మాట్లాడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: