స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోర్డర్ లోని సైనికుడి సత్తా చాటే కథతో నా పేరు సూర్య అంటూ వస్తున్నాడు. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ కూడా బన్ని కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. 


వరుస విజయాలతో దూసుకెళ్తూ స్టార్ డం ను పెంచుకుంటున్న బన్ని కెరియర్ లో ఒకదానికి మించి మరో సినిమా హిట్ కొడుతూ వస్తున్నాడు. సరైనోడు, డిజే సినిమాల సక్సెస్ తో తన సత్తా చాటిన బన్ని ఇప్పుడు నా పేరు సూర్య కూడా ఆ సక్సెస్ సినిమాల సరసన చేరడం ఖాయమని అంటున్నారు.


ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 77.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం జరిగింది. డిజే సినిమా హయ్యెస్త్ కలక్షన్స్ కు దగ్గరగా ఈ సినిమా బిజినెస్ జరగడం విశేషం. ఓవర్సీస్ లో కూడా బన్ని 7.2 కోట్లతో సినిమా బిజినెస్ జరిగింది. ఇక ఏరియాల వారిగా నా పేరు సూర్య బిజినెస్ ఎలా జరిగిందో చూస్తే..


నైజాం : 20.2 కోట్లు
సీడెడ్ : 11.25 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.5 కోట్లు
గుంటూరు : 5.5 కోట్లు
ఈస్ట్ : 5.2 కోట్లు
వెస్ట్ : 4.20 కోట్లు
కృష్ణా : 4.50 కోట్లు
నెల్లూరు : 2.60 కోట్లు


ఏపి, తెలంగాణా మొత్తం 61.95 కోట్ల బిజినెస్ చేయగా..రెస్ట్ ఆఫ్ ఇండియా 8.50 కోట్లు భారీ బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 7.2 కోట్లతో కలుపుకుని వరల్డ్ వైడ్ గా నా పేరు సూర్య సినిమా 77.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: