నా పేరు సూర్య ఆడియో విషయం లో వెనుక చాలా కథ నడిచిందని చాలా మంది మంది అభిప్రాయ పడుతున్నారు. టీవీ 9 మీద పవన్ కళ్యాణ్ ధ్వజం ఎత్తిన సంగతి తెలిసిందే. అందుకే టీవీ 9 కు సినిమా కు సంభిందించి ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు. పైగా టీవీ 9 కు సినిమా ఆడియో ఫంక్షన్ లైవ్ కు అనుమతి ఇవ్వలేదు. దీనికి అల్లు అరవింద్ మాట్లాడిన మాటలే నిదర్శనాలు అయితే టీవీ 9 కు అనుమతి లేక పోయిన ఆ ఛానల్ లో లైవ్ కనిపించింది. 

Image result for naa peru surya

నా పేరు సూర్య ప్రీ రిలీజ్ లైవ్ కాస్ట్ తమకు కూడా ఇవ్వమని టీవీ-9, టీవీ-5 చానెళ్లు నిర్మాతల మీద తీవ్ర వత్తిడి తెచ్చినట్లు బోగట్టా. దానికి యూనిట్ కీలకబాధ్యులు, ఇదిగో అదిగో అని సాగదీసి, ఆఖరికి సాయంత్రం అయిదు తరువాత, 'సారీ' అని మెల్లగా చెప్పారట. సరే, ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఇంతలో బయట నుంచి ఎవరో ఫోన్ చేసి టీవీ-9లో లైవ్ వస్తోంది అని చెప్పారట. దీంతో ఆశ్చర్యపోయిన యూనిట్ జనాలు చానెళ్ల సంబంధీకులకు పోన్ చేసి, దయచేసి లైవ్ ఆపమని, అలా చేయడం వల్ల తమకు సమస్యలు వస్తాయిని చెప్పినట్లు వినికిడి. కానీ లైవ్ ఆగలేదు.

Image result for naa peru surya

దీంతో అల్లు అరవింద్ తన స్పీచ్ లో అలా మాట్లాడక తప్పలేదని, పైగా పదే పదే స్టేజ్ మీద లైవ్ ను ఎన్టీవీకి, మరో చానెల్ కు ఇచ్చినట్లు చెబుతూ వచ్చారు. ఎక్కడా టీవీ-9 పేరు ప్రస్తావన లేదు. సినిమా ప్రకటనలు కూడా టీవీ-9తో పాటు మరో రెండు చానెళ్లకు ఇవ్వలేదని, అలాంటిది లైవ్ హక్కులు ఎలా ఇస్తామని నా పేరు సూర్య సినిమా  యూనిట్ వర్గాల ప్రశ్నించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: