మెగా ఫ్యామిలీకి మరియు మీడియా కు ఓ రేంజ్ లో యుద్ధం లో జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫామిలీ కొన్ని ఛానల్ ను బాన్ చేయాలని కూడా పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే నాపేరు సూర్య ఆడియో ఫంక్షన్ లో కూడా కొన్ని ఛానల్ గురించి ఇండైరెక్ట్ గా అల్లు అరవిందు మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన నుంచి నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని ఏకంగా అల్లు అరవిందే అన్నాడు. 

Image result for naa peru surya

ఇప్పుడు నా పేరు సూర్య కు తెల్లవారుఝామును అయిదు గంటల నుంచి షోలు వేసుకునే వెసులుబాటు ఇస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మెగా ఫామిలీ పూర్తిగా మీడియా కు మరియు టిడిపి కి దూరం అయిపోవడమే. సరే భరత్ అనే నేను సినిమాలో కథనాయకుడు మహేష్ బాబు 'దేశం' ఎంపీ గల్లా జయదేవ్ కు బావమరిది. అలాగే రంగస్థలం సినిమా నిర్మాతలు తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు వున్నవారే. ఇప్పుడు సూర్య దగ్గరకు వచ్చేసరికే తకరారు వచ్చింది.

Image result for naa peru surya

ఓ పక్క పవన్ కళ్యాణ్ కాస్తా తెలుగుదేశం పార్టీకి దూరం కావడం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, అలాగే మెగా క్యాంప్ మొత్తం మీడియాతో సున్నం పెట్టుకోవడం వంటి పరిణామాలు సంభంవించాయి. బహుశా మరి అందుకే కావచ్చు, అయిదు గంటల నుంచి షోలు అడుగుతూ 'నా పేరు సూర్య' పెట్టుకన్న దరఖాస్తు అలా పెట్టిన చోటే వుందని తెలుస్తోంది. పెట్టిన చోట నుంచి ఆ అప్లికేషన్ అంగుళం కూడా కదల్లేదని తెలుస్తోంది. అయితే ఇంకా మూడు రోజులు టైమ్ వుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఒక రోజు ముందుగా అయినా అనుమతి ఇవ్వవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: