మహేష్ లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను ఓ పక్క బాక్సాఫీస్ పై విజయ యాత్ర కొనసాగిస్తుండగా సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విజయవాడ, తిరుపతి వెళ్లొచ్చిన మహేష్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ఓ ఈవెంట్ జరుపుకున్నాడు.


ఇక ఇది చాలదు అన్నట్టు స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. జయ ప్రకాశ్ నారాయణకు భరత్ అనే నేను సినిమా చూపించారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా ఇంటర్వ్యూస్ లో మహేష్ పై పొగడ్తల వర్షం కురిపించాడు కొరటాల శివ. మొన్న జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఈ సూపర్ స్టార్ కు నాలుగేళ్లలో రెండు సార్లు లైఫ్ ఇచ్చిన దర్శకుడని శివని పొగుడుతూ అన్నాడు మహేష్.


అయితే ఆ మాటని తాను అంగీకరించనని. మన కథను గొప్ప స్థాయికి తీసుకెళ్లే నటుడు మహేష్ అని ఆయనని దృష్టిలో ఉంచుకుని కథ రాస్తే ఇంకా బాగా రాయాలన్న స్పూర్తి కలుగుతుందని అన్నారు. ఇక సినిమాలో ఏ రెండు సీన్స్ ఒకేళా ఉండాలని కోరుకోని మహేష్ ఫ్లాపులను ఫేజ్ చేయడం అతని తప్పు కాదని అన్నారు కొరటాల శివ.


ప్రయోగాలు చేసే టైంలో కొన్ని సార్లు రిజల్ట్ తేడా కొడుతుంది. కాబట్టి అందులో మహేష్ తప్పేం లేదని అంటున్నాడు కొరటాల శివ. మొత్తానికి శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల సక్సెస్ తో రెండు హిట్లు కొట్టిన ఈ కాంబో 3వ సినిమా ఎప్పుడు చేస్తారో ఎలాంటి కథ చేస్తారో అని ఫ్యాన్స్ తో పాటు సిని ప్రియులు ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: