తెలుగు చిత్ర సీమలో కేవలం తన కంటితోనే హావభావాలు పలికించ గల మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఆడియో వేడుక నిన్న జరిగింది.  పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు సావిత్రి కుమారుడు సతీశ్, కుమార్తె విజయ హాజరయ్యారు.
Image result for mahanati audio functions
ఈ సందర్భంగా సినిమా విశేషాలు వారు మీడియాతో పంచుకున్నారు. నాగ్ అశ్విన్ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నట్లు..మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు తెలుసుకున్న తర్వాత కాస్త భయం వేసిందని..ఆమె ఎంతో వైభవంగా గడిపిన జీవితం చూపిస్తారా..చివరి దశలో ఎంతో ట్రాజెడీ లైఫ్ ని చూపిస్తారా అన్న ఆలోచనలో పడ్డామని సావిత్రి తనయుడు సతీష్ అన్నారు. 
Image result for mahanati audio functions
దాంతో నేనూ నా సోదరి విజయ..దర్శకులు నాగ్ అశ్విన్ తో ఈ సినిమాకు సంబంధించి స్టోరీ వినాలని చెప్పాం.  వెంటనే ఆయన మా వద్దకు వచ్చి స్టోరీ వినిపించడం మొదలు పెట్టారు..ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని.. ఏడవకూడదనుకుంటూనే 30 సార్లు ఏడ్చేశానని సతీశ్ వివరించారు. మహానటి సావిత్రి ఎంతో గొప్ప నటీమణి అన్న విషయం అందరికీ తెలిసిందే..అదే సమయంలో ఆమె గొప్ప ధైర్యవంతురాలని అన్నారు. 

అంతే కాాదు ఆమో ఎన్నో గుప్త దానాలు చేసేవారని..ఎక్కువగా సెంటిమెంట్..ఎమోషన్ కలిగిన వ్యక్తి అని..ఎంతో మంది నటీమణులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని ఆమె కుమార్తె విజయ అన్నారు. కాగా, ‘మహానటి’  సినిమాలో టైటిల్ రోల్‌ను కీర్తి సురేశ్ పోషించగా, సమంత జర్నలిస్ట్ పాత్రలో నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: