నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటె ఎన్టీఆర్ వక్కంతం వంశి దర్శకత్వం లో చేయాల్సింది. కానీ స్టోరీ విషయం లో వీరి ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ వెంటనే ఎన్టీఆర్ వేరే సినిమా లతో బిజీ అయిపోయాడు. వక్కంతం వంశి కూడా బన్నీ తో సినిమా కు సిద్ధం అయిపోయి ఇప్పుడు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే తనకు ఎన్టీఆర్ కు ఎటువంటి విభేదాలు లేవని వక్కంతం వంశి చెబుతున్నాడు. 

Image result for vakkantham vamsi

నిజానికి ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. నన్ను దర్శకుడిగా మారమని ప్రోత్సహించిన వ్యక్తి తారక్. మేమిద్దరం కలిసి ఓ స్టోరీపై వర్కవుట్ చేశాం. కానీ అది వర్కవుట్ కాలేదు. వేరే ఎప్పుడైనా కలిసి పనిచేద్దామని ఓ మాట అనుకొని మేం విడిపోయాం. అంతే తప్ప మా మధ్య ఎలాంటి అభిప్రాయబేధాల్లేవు." 

Image result for vakkantham vamsi

ఇలా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు వక్కంతం. ప్రస్తుతం బన్నీతో చేసిన నా పేరు సూర్య సినిమాకు, గతంలో ఎన్టీఆర్ కు వినిపించిన స్టోరీకి ఎలాంటి సంబంధం లేదని కూడా అంటున్నాడు. "పూర్తిగా ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని గతంలో ఓ స్టోరీ రాసుకున్నాను. ఆ స్టోరీని కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే చేస్తాను. నా పేరు సూర్య కథ ఎన్టీఆర్ కు చెప్పలేదు. తనను కొత్త దర్శకుడిగా బన్నీ ఎప్పుడూ ట్రీట్ చేయలేదంటున్న వక్కంతం వంశీ.. ఇప్పటికీ ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నానని అంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: