ప్రియా ప్రకాశ్ వారియ‌ర్.. ఈ పేరు అతి త‌క్కువ టైంలోనే అంద‌రి నోళ్ళ‌లో నానింది. కేవ‌లం ఒకే ఒక్క క్లిప్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారింది ప్రియా ప్ర‌కాశ్‌. ఒక్క కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన  ప్రియా ప్రకాశ్ వారియర్ అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ మద్య టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని  ఫిలిం న‌గ‌ర్‌లో చక్కర్లు కొట్టాయి.    అంతే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. 
Image result for priya prakash varrier
మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ టీజర్‌లో సందడి చేసిన ప్రియా, ఆ సినిమా విడుదలకు ముందే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.  ప్రియాకు వచ్చిన ఆదరణ చూసిన చిత్ర యూనిట్‌ ఆ తర్వాత సినిమాలో ఆమె పాత్ర నిడివిని పెంచేలా రీ షూట్‌ చేశారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌కు ఏ మ్రాతం తీసిపోని ఆదరణ ఆమె సొంతం.  ఈ అమ్మడు ఎక్కడికి వెళ్లినా పెద్ద సెన్సేషన్ అవుతూ..సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
Image result for priya prakash varrier
తాజాగా ప్రియా వారియర్  ఓ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఒరు అదార్‌ లవ్‌లో నటించిన తన సహ నటుడు అరుణ్‌ మ్యారేజ్‌కు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంతమంది మాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్న ఈ వివాహ వేడకలో ప్రియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  ఈ వేడుకకు అరుణ్ కుటుంసభ్యులు, అతని స్నేహితులు, సన్నిహితులతో పాటు మాలీవుడ్ ప్రముఖులు కొందరు మాత్రమే పాల్గొన్నారు.

ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియా వారియర్ పింక్ రంగు చీరలో మెరిసిపోయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ సినిమా ‘ఇన్సాఫ్ అప్నే లాహూ సే’ లోని ‘హవా హవా’ అనే పాటకు తన మిత్రులతో కలిసి ప్రియా వారియర్ ఆడిపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: