సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా స్టార్ టివి మొదలుపెట్టిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. కంటెస్టంట్స్ ఎలా ఉన్నా తారక్ హోస్టింగ్ టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.


ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-2కి రంగం సిద్ధం అవుతుంది. నాని ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా ఉంటారని అంటున్నారు. ఇక ఈ సీజన్ లో కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న సామాన్య వ్యక్తులు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. దానికి సంబందించిన ఆడిషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.


మొదటి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంథ్ ఈ విషయానికి సంబందించిన వీడియో తన ఇన్ స్టాగ్రాంలో పెట్టింది. ఆల్రెడీ హిందిలో ఆడియెన్స్ లో కూడా బిగ్ బాస్ హౌజ్ లో ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే తెలుగులో అది కూడా రెండో సీజన్ లోనే ఈ ప్రయోగం చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు.


నాని హోస్ట్ గా అన్నది కన్ఫాం చేయనప్పటికి దాదాపు అతనే బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ గా ఉంటాడని తెలుస్తుంది. జూన్ నుండి మొదలవనున్న ఈ బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో సెలబ్రిటీస్ తో పాటుగా ఆడియెన్స్ కు ఛాన్స్ ఇవ్వడం మంచి విషయం. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: