కింగ్ నాగార్జున తన తనయుల విషయంలో ఇంకా దిగులుగానే ఉన్నాడని తెలుస్తుంది. నాగ చైతన్య ఎలాగు హీరోగా సెటిల్ అయ్యాడు.. స్టార్ ఇమేజ్ రాకున్నా సమంత భర్తగా తనకంటూ ఓ క్రేజ్ వచ్చింది. ఇక ఎటొచ్చి నాగ్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది ఎవరైనా ఉన్నారా అంటే అది తన చిన్న కొడుకు అఖిల్ అనే చెప్పొచ్చు.


అఖిల్ సినిమాతో హీరోగా క్రేజీ డెబ్యూ ఇచ్చిన అఖిల్ సెకండ్ సినిమాగా హలో అంటూ పలుకరించాడు. అయితే రెండు సినిమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో నాగార్జున అఖిల్ కెరియర్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ తొలిప్రేమ డైరక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమా తర్వాత అఖిల్ రేంజ్ పెంచేలా కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేశాడట నాగార్జున. మిర్చి నుండి లేటెస్ట్ గా వచ్చిన భరత్ అనే నేను సినిమా వరకు కొరటాల శివ టాలెంట్ ఏంటో అర్ధమైంది. ఇక ఈ సినిమాపై నాగ్ ముందునుండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

Image result for akhil

భరత్ తర్వాత కొరటాల శివ ఖాళీగానే ఉన్నాడు. బన్ని సినిమా ఉంటుందని ఊహించినా అతను విక్రం కుమార్ కు ఫిక్స్ అయ్యాడు. సో కొరటాల శివ అఖిల్ సినిమా దాదాపు కన్ఫాం అయినట్టే లెక్క. డిసెంబర్ నుండి మొదలవనున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది.     


మరింత సమాచారం తెలుసుకోండి: