రామ్ చరణ్ సినిమా రంగ స్థలం కి సుమారు రెండేళ్లు పట్టింది.  అయితే ఈ సినిమా ఇన్నేళ్లు పట్టడానికి అందరు సుకుమార్ కారణం అనుకున్నారు. సుకుమార్ చెక్కుడు లేట్ అవ్వడం వల్లే ఇన్నేళ్లు పట్టిందని అందరు అభిప్రాయ పడ్డారు. అయితే సినిమా లేట్ అవ్వడానికి రామ్ చరణ్ కూడా కారణం అని చెప్పవచ్చు. చరణ్ చాలా సార్లు సినిమా షూటింగ్ కు రాలేదని, తనకు మూడ్ లేనప్పుడు షూటింగ్ కు వచ్చే వాడు కాదని తెలుస్తుంది. 

Image result for ram charan

ఇప్పుడు బోయపాటితో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఇదే మళ్లీ జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికి మూడుసార్లు చరణ్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాపం, హీరోయిన్ కైరా అద్వానీని మూడు సార్లు ఇక్కడకు పిలిపించి, మళ్లీ మూడు సార్లు వెనక్కు పంపారట. షూటింగ్ లేకపోవడంతో. ఇదిలావుంటే బోయపాటి పూర్తి యాక్షన్ సినిమాగా చరణ్ కోసం స్క్రిప్ట్ తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బిహార్ సిఎమ్ క్యారెక్టర్ విలన్ గా కనిపిస్తుంది.

Image result for ram charan

అయితే ఇప్పడు లేటెస్ట్ గా మరో గుసగుస వినిపిస్తోంది. చరణ్ కోరిక మేరకు, రంగస్థలం తరువాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వినికిడి. కాస్త కీలకమైన మార్పే చేసి, కొత్త జోనర్ ను బోయపాటి లైట్ గా టచ్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అన్నిటిని రంగ స్థలం మాదిరిగా తీయాలనుకుంటే మొదటికే మోసం వస్తుందని తెలుసుకుంటే మంచిదని ఇండస్ట్రీ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: