సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తీసిన బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీని ఎవరెస్ట్ శిఖరాలకు తీసుకెళ్లిన సినిమాలవి. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైం రికార్డ్స్ సాధించింది. అయితే ఈ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.

Image result for bahubali 2 in china

          తెలుగులో నిర్మితమైన బాహుబలి 2 సినిమా గతేడాది ఏప్రిల్ లో భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రిలీజైంది. రూ.1500 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు వసూల్ చేసిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. రెండో స్థానంలో దంగల్ ఉండగా.. మూడో స్థానంలో బాహుబలి ది బిగినింగ్ నిలిచింది. అయితే బాహుబలి 2 సినిమా కలెక్షన్ల వర్షానికి ఇంకా అడ్డు లేకుండా ఉంది.

Image result for bahubali 2 in china

          ఇటీవల చైనాలో రిలీజైన బాహుబలి 2 సినిమా సంచలనం సృష్టించింది. సుమారు 1800 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజే రూ.19 కోట్లు వసూల్ చేసింది. సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం సినిమాల తర్వాత హైయ్యెస్ట్ కలెక్షన్లు వసూల్ చేసిన సినిమాగా బాహుబలి 2 సినిమా నిలిచింది. భారత్ లో రిలీజైన ఏడాది తర్వాత చైనాలో రిలీజైనా కూడా ఈ స్థాయి కలెక్షన్లు వసూలు చేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Image result for bahubali 2 in china

          సాధారణంగా హిందీ సినిమాలకు విదేశాల్లో మంచి క్రేజ్ ఉంది. చైనాలో కూడా పలువురు హిందీ స్టార్లకు స్టార్ డమ్ ఉంది. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ల సినిమాలు అక్కడ బాగానే వసూల్ చేస్తుంటాయి. అయితే ఒక భారతీయ ప్రాంతీయ చిత్రం ఒక్క రోజులో 19 కోట్లు వసూలు చేయడం ఆషామాషీ విషయం కాదు. బాహుబలి 2 హీరో ప్రభాస్ చైనాలో సుపరిచిత నటుడు కాదు. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్, స్టోరీ, నరాలు తెగే ఉత్కంఠ బాహుబలి 2ను ఎవరెస్ట్ శిఖరంపై కూర్చోబెట్టాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: