ఈ మద్య తెలుగులో మల్టీ స్టారర్స్ కు మంచి డిమాండ్ పెరిగిపోయింది.  గతంలో టాప్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాంబినేషన్..ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్..ఇలా స్టార్ హీరోల కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.  ఈ మద్య యువహీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు.  ఆ మద్య మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అద్భుతమైన కాంబినేషన్ లో సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత పవన్ కళ్యాన్, వెంకటేష్ కాంబినేషన్ లో గోపాల గోపాల చిత్రం మంచి విజయం అందుకుంది. 
Image result for venkatesh varun tej
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లు కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ కి జోడీగా మెహ్రీన్, వెంకీ సరసన తమన్నాని ఫైనల్ చేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. అలాగే జూన్ మొదటివారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే నెలలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నారు.
Image result for venkatesh varun tej
మొదట్నుంచి ఈ హీరోల సరసన ఎవరు జతకడతారోనని కూసింత సందిగ్దత నెలకొని ఉండేది. దానికి తెర దించేలా వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తున్నట్లు ఇవాళే చిత్రబృంద అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న ఈ సినిమా జూన్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ చిత్రం పూర్తిగా కామెడీ ప్రధానంగా..ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపొందనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: