డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఈమధ్య వరుస ఫ్లాపులతో కాస్త వెనుకపడ్డాడని తెలిసిందే. స్టార్ హీరోస్ ఎవరు ప్రస్తుతం పూరితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్న ఈ సందర్భంలో పూరి తనయుడితో మెహబూబా అంటూ ఓ సినిమా చేశాడు.


1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమకథను పొందుపరచి పూరి చేస్తున్న సినిమా మెహబూబా. పూరి ఆలోచనల్లో జనగణమన సినిమా గురించి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఆ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు పూరి. అంతేకాదు పోకిరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జనగణమన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. 


అయితే ఈ ప్రాజెక్ట్ పై పూరి నమ్మకంగా ఉన్నా మహేష్ మాత్రం ప్రస్తుతం ఈ సినిమా చేసే ఆలోచనలో లేడని తెలుస్తుంది. భరత్ అనే నేను తర్వాత వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత సుకుమార్ తో సినిమా కన్ఫాం చేసుకున్నాడు. ఇక సందీప్ వంగ డైరక్షన్ లో మూవీ కూడా లైన్ లో ఉందని తెలుస్తుంది. 


ఈ సినిమాలన్ని పూర్తి చేశాక రాజమౌళితో కూడా సినిమా ఉంటుందని చెబుతున్నారు. మరి వీటన్నిటి పూర్తి చేసే దాకా పూరి ఆగుతాడా లేక జనగణమన వేరే హీరోతో చేస్తాడా అన్నది చూడాలి. మెహబూబా ప్రెస్ మీట్ లో మాత్రం పూరి జనగణమన గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు. నిర్భయ, అసిఫా ఘటనలు జరిగినప్పుడు వేరే దేశాల్లో తలలు తీసేస్తారు. 


మన దేశంలో అలాంటి చట్టాలు లేవు. ఇక్కడ ఎవరికి భయం లేకుండా పోయింది. తన సినిమా కథ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. పోకిరి, బిజినెస్ మేన్ లను మించిన కథ ఇదని చెబుతున్నాడు పూరి. మరి మహేష్ ఎప్పుడు పూరికి ఛాన్స్ ఇస్తాడో ఆయన ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: