పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో మెగా మేనియా షురూ చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ సినిమాగా ఉయ్యాల నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతగా ఈ సినిమా వస్తుంది. 


బాహుబలి సినిమా ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాను దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హింది ఒకేసారి రిలీజ్ చేసేలా చూస్తున్నారు. సినిమాకు వచ్చిన బజ్ ప్రకారం సినిమా రిలీజ్ భారీగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది.


చిరంజీవికి అచ్చొచ్చిన మే 9న సైరా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మే 9న మాత్రమే ఎందుకు అంటే మే 9న రిలీజ్ అయిన చిరంజీవి సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ ఇలా చిరు సినిమా మే 9న వచ్చింది అంటే అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క.


ఆ సెంటిమెంట్ ప్రకారం 2019 మే 9న సైరా నరసిం హారెడ్డి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈమధ్యనే సైరాలో చిరు లుక్ రివీల్ అయ్యింది. అయితే అవి అఫిషియల్ గా రిలీజ్ చేయడానికి ఇంకాస్త టైం ఉందని తెలుస్తుంది. బిగ్ బి అమితాబ్ తో పాటుగా జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. నయనతార ఫీమేల్ లీడ్ గా సెలెక్ట్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: