మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ‌ను వెండితెర‌పై `మ‌హాన‌టి`గా చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌. వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో నటించిన ఒక్కొక్క‌రి పాత్ర‌నూ రివీల్ చేస్తోంది. ఇక సావిత్రి కి అంత గొప్ప పేరు రావడం వెనుక ఓ గొప్ప వ్యక్తి ఉన్నారన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు.
Image result for mahanati posters
నటి సావిత్రి చెన్నై చేరుకోవడం, సినీ రంగంలోకి ప్రవేశించి చెరిగిపోని ముద్ర వేయడం వెనుక ఓ గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయనే సావిత్రి పెదనాన్న కేవీ చౌదరి. సావిత్రి నటిగా కొత్త జీవితం ప్రారంభించడానికి ఆయనే కారణం. అందుకే సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో కేవీ చౌదరి పాత్రకు చాలా ప్రాధాన్యతే ఉంది. నేచుర‌ల్ స్టార్ నాని వాయిస్‌తో ఒక్కో పాత్ర‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
 Mahanati: Rajendra Prasad as KV Chowdary
తాజాగా ఈ సినిమాలో న‌టించిన రాజేంద్ర‌ప్ర‌సాద్ పాత్ర‌ను ప‌రిచయం చేస్తూ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. సావిత్రి పెద‌నాన్న కేవీ చౌద‌రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కేవీ చౌద‌రి కార్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవారు..అంతే కాదు సావిత్రిలో చిన్ననాడే ఓ అద్భుతమైన నటిని చూశారు..అందుకే సావిత్రి వెండితెర‌పై వెలిగిపోవాల‌ని క‌ల‌లు క‌న్న‌ది ఆయ‌నే. సావిత్రి కెరీర్‌లో ఆయ‌న‌దే ప్ర‌ధాన పాత్ర‌. సావిత్రి సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించ‌డం వెనుక‌, మ‌హాన‌టిగా మార‌డం వెనుక కేవీ చౌద‌రి పాత్ర ఎంతో ఉంది.
Related image
అలాంటి కీల‌క‌మైన పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌నిపించ‌నున్నారు.పంచెకట్టుతో కళ్లద్దాలు పెట్టుకుని ఉత్తరం చదువుతున్నట్టు ఉన్న నట కిరీటి లుక్ చాలా నేచురల్‌గా ఉంది. ‘మహానటి’ సినిమాకి, కథలో సావిత్రి జీవితానికి కేవీ చౌదరి వెన్నెముక లాంటి వారని, ఆ పాత్ర రాజేంద్ర ప్రసాద్ చేయడం సినిమా యూనిట్‌కు దక్కిన అదృష్టమని నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: