టాలీవుడ్ లో గత కొంత కాలాంగా కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  ఈ నేపథ్యంలో ఆమెకు పలు మహిళా సంఘాల, జూనియర్ ఆర్టిస్టుల నుంచి మద్దతు లభించింది.  దాంతో కొన్ని ప్రెస్ మీట్స్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలను బహిరంగంగా చర్చించారు.  ఈ నేపథ్యంలో ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు కొన్ని ఛానల్స్ వేధికగా తమ గోడు విన్నవించుకున్నారు. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ తీవ్ర రూపం దాల్చుతుందన్న సమయంలో జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యన్ పై కొన్ని అసభ్యకరమైన మాటలు అనడంతో ఒక్కసారే శ్రీరెడ్డి కథ వేరే మలుపు తిరిగింది. 

Image result for sri reddy

అప్పటి వరకు ఆమెకు మద్దతు ఇచ్చిన వారు యూటర్న్ తీసుకున్నారు. అంతే కాదు పవన్ ఫ్యాన్స్ ఆమెపై దండయాత్ర మొదలు పెట్టారు.  దాంతో కొంత కాలంగా శ్రీరెడ్డి ఇంటికే పరిమితం అయ్యారు. కాకపోతే ఈ మద్య ప్రెస్ మీట్ లో మరోసారి ఇండస్ట్రీపై విరుచుకుపడ్డారు. అంతే కాదు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వస్తున్నారు. ఇక సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని తానే మోస్తున్నానని ఫిర్యాదులో తెలిపింది.

Image result for sri reddy pawan kalyan

తన కుమార్తె అనారోగ్యం కారణంగా తను అప్పులపాలై కష్టాల్లో ఉన్న సమయంలో బాలాజీ వచ్చి తన భార్యకు కిడ్నీ ఇస్తే..రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారని..కానీ ఇప్పటి వరుకు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చి తప్పుడు పత్రాలతో తనను దారుణంగా మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో శ్రీరెడ్డి సహాయం తీసుకున్నానని..ఆమెతో వచ్చి ఫిర్యాదు చేసినట్లుగా బాధితురాలు తెలిపింది.

Image result for sri reddy media

ఈ సందర్భంగా నటి శ్రీరెడ్డి మాట్లాడుతూ..ఇండస్ట్రీలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయని..అందుకే తాను ముందుకు వచ్చానని..అంతే కాదు జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి విషయంలో చాలా మోసం జరిగిందని.. న్యాయం చేయాలని కోరుతూ... జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, మా అసోసియేషన్ లకు ఫిర్యాదు చేశామని చెప్పింది. లక్ష్మి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, తన ఇంటి పైపోర్షన్ ను రాసిస్తానని, సినిమా క్యారెక్టర్లను ఇప్పిస్తానని బాలాజీ మాయమాటలు చెప్పి, మోసం చేశాడని తెలిపింది. లక్ష్మికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: