మహానటి సినిమా చూసిన తరువాత ప్రతి ప్రేక్షకుడు సినిమా తీసిన దర్శకుడు కు ఫిదా అయిపోయారు.నిజంగా ఈ డైరెక్టర్ కు కనీసం పదేళ్లు కూడా అనుభవం లేదు. పదుల్లో కొద్దీ సినిమా లు తీయలేదు. కానీ ఈ బయో పిక్ చూసిన తరువాత ప్రతి ప్రేక్షకుడు ఈ డైరెక్టర్ టాలెంట్ కు ముగ్ధులైపోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో బయో పిక్ లు వచ్చాయి కానీ ఈ సినిమా డీల్ చేసిన విధానం బయో పిక్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ అని చెప్ప వచ్చు. 

Image result for nag ashwin director

ఈ సినిమా గురించి దర్శకడు ఎక్కడ హడావిడి చేయలేదు. ఎక్కడ లీకులు ఇవ్వలేదు. రకరకాల సోషల్ మీడియా ఫీట్స్ చేయలేదు. మేధావి లాగా, ఇంతకంటే సూపర్ డైరక్టర్ అన్నట్లు బిల్డప్ లు ప్రొజెక్ట్ చేయలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయాడు. అసలేం చేస్తున్నాడో కూడా తెలియదు. పైగా తీసుకున్న సినిమా పీరియాడిక్ డ్రామా. ఇష్టం వచ్చినట్ల మాయిష్మతి సెట్ లు వేసేయడానికి వీల్లేదు. సెట్ ప్రాపర్టీస్ లో తేడారాడానికి వీల్లేదు. కాల్పనిక ఫిక్షన్ కథ కాదు.

Image result for nag ashwin director

హీరో రథాల షెడ్ లో దాక్కుని, అంతవరకు ఏం చేస్తున్నాడని అడిగేదే లేని వ్యవహారం కాదు. పక్కాగా ప్రతి సంఘటనకు కనిపించని, గీతలు, పరిమితులు వున్నాయి. ఇక ఇవన్నీ చాలదన్నట్లు పెద్దగా స్టార్ కాస్ట్ హడావుడే లేదు. అన్నింటికి మించి వందల కోట్ల బడ్జెట్ లేదు. ఇన్నింటి నడుమ మహానటి సినిమా తీసి అబ్బురపరిచాడు. చూసిన ప్రతి సినిమా జనం ఒకటే అంటున్నారు. నాగ్ అశ్విన్ ఎంత శ్రమపడ్డాడు. ఎంత ఆలోచించాడు. ఎంత వర్క్ చేసాడు. ఎంత కృషి వుంది అని. ఓ దర్శకుడు అంతకన్నా ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం లేనంతటి సినిమాగా మహానటి నిలిచిపోతుంది. బయోపిక్ లకు ఓ కొలమానంగా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: