సావిత్రి బయోపిక్ అంటే మొన్నటితరం కథానాయిక కదా.. అంటే తాతలు, తండ్రులకు తెలిసిన కథ కదా అని యువత దాని మీద ఏమంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అనుకున్నారు. కాని నిన్న రిలీజ్ అయిన మహానటి సినిమా చూస్తే రిలీజ్ రోజు సైతం హంగామా చేస్తుంది యువకులే అని తెలుస్తుంది. 


మహానటి థియేటర్ ఆక్యుపెన్సీలో 90 శాతం మంది యువకులే ఉండటం విశేషం. మిగతా 10 శాతం వరకు మధ్య వయసు గలవారని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమా సావిత్రి జీవిత కథను ఆవిష్కరించారు. సినిమాను ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. కీర్తి సురేష్ అభినయ తారగా మహానటిగా అభిమానాన్ని చోరగొంది. 


అశ్వనిదత్ సమర్పణలో స్వప్నా సినిమాస్ బ్యానర్లో ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించింది. మిక్కి జే మేయర్ సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా కనిపించారు. ఆయన పాత్రకు ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు ఆకట్టుకున్నాయి.  


ప్రకాశ్ రాజ్, నాగ చైతన్య, క్రిష్, అవసరాల శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు ఇలా అందరు సినిమాలో ఒకప్పటి దర్శక నిర్మాతల పాత్రలలో కనిపించి అలరించారు. సినిమా చూసి ఇంటికి వచ్చినా మహానటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అంతటి గొప్ప అనుభూతిని మిగిల్చేలా చేసిన దర్శకుడికి కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: