ఇన్నాళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారనుకోగా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చంపేస్తాం, పొడిచేస్తాం అంటున్నారు. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుతో పాటుగా మలయాళంలో కూడా అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.


రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య కేరళలో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా చూసి రివ్యూ రేటింగ్ ఇచ్చిన అపర్ణ ప్రశాంతి సినిమా గురించి కాస్త నెగటివ్ గా రాసిందట. దానికి ఆమె నెంబర్ కనుక్కొని మరి ఆమెని చంపేస్తామని బెదిరిస్తున్నారట కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్.  


అయితే ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిందట. మరి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన నా పేరు సూర్య సినిమా తెలుగులో ఎలా ఉన్నా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అక్కడ బన్నికి స్టార్ ఫాలోయింగ్ ఉంది.


టాలీవుడ్ స్టార్స్ ఇతర భాషల్లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకోవడం మాములు విషయం కాదు. తెలుగు రివ్యూస్ ఎలా ఉన్నా ఇక్కడ ఫ్యాన్స్ పట్టించుకోలేదు కాని కేరళ బన్ని ఫ్యాన్స్ మాత్రం బన్ని మీద ఉన్న ఇష్టాన్ని ఆ రివ్యూ రైటర్ మీద చూపించారు. ఈ ఇష్యూపై ఆమె చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: