స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కతం వంశీ డైరక్షన్ లో వచ్చిన నా పేరు సూర్య అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని హిట్ మేనియాను నా పేరు సూర్య కొనసాగిస్తుందని ఊహించిన అభిమానులకు సూర్య షాక్ ఇచ్చింది. యాంగ్రీ సోల్జర్ గా సూర్య పాత్రలో బన్ని అదరగొట్టినా బాక్సాఫీస్ మాత్రం షేక్ చేయలేకపోయాడు.


మొదటి రోజు నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వారం రోజుల్లో 44.64 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన నా పేరు సూర్య హిట్ అనిపించుకోవాలంటే మరో 30 రాబట్టాల్సిందే. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది కష్టమే అనిపిస్తుంది. మరో పక్క నా పేరు సూర్య 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ పోస్టర్స్ హడావిడి చేస్తుంటే. 


వారంలో బన్ని నా పేరు సూర్య 44.64 కోట్ల షేర్ మాత్రమే రాబట్టాడు ఇది వాస్తవమని అంటున్నారు. ఇక ఏరియాల వారిగా నా పేరు సూర్య వసూళ్ల లెక్క చూస్తే.. నైజాం : 11.10 కోట్లు, సీడెడ్ : 5.80 కోట్లు, ఉత్తరాంధ్ర : 4.51 కోట్లు, ఈస్ట్ : 3.20 కోట్లు, వెస్ట్ : 2.47 కోట్లు, కృష్ణా : 2.32 కోట్లు, గుంటూరు :3.66 కోట్లు, నెల్లూరు : 1.37 కోట్లు ఏపి/తెలంగాణా మొత్తం కలిపి 34.43 కోట్లను సాధించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 6.20 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 4 కోట్లు రాబట్టింది.


ప్రపంచవ్యాప్తంగా నా పేరు సూర్య 44.64 కోట్ల కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. రైటర్ గా సూపర్ హిట్లు కొట్టిన వక్కంతం వంశీ దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. అయితే కలక్షన్స్ ఎలా ఉన్నా బన్ని మాత్రం ఈ సినిమాలో సోల్జర్ గా బాధ్యతాయుతమైన పాత్రలో నటించి మెప్పించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: