స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. రైటర్ వక్కతం వంశీ డైరక్టర్ గా మొదటి ప్రయత్నమే నా పేరు సూర్య. అయితే వక్కంతం వంశీ మీద పెట్టుకున్న బన్ని నమ్మకం నిలబెట్టుకోలేదు. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా మొదట డివైడ్ టాక్ తో మొదలైనా చివరగా ఫ్లాప్ దిశగా వెళ్తుంది.


వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న అల్లు అర్జున్ నా పేరు సూర్య తన కెరియర్ కు మరింత ఉత్సాహం ఇస్తుందని భావించాడు. కాని అనూహ్యంగా సినిమా నిరాశ కలిగించింది. సినిమా యావరేజ్ టాక్ ఉన్నా బాక్సాఫీస్ పై మాత్రం ప్రభావితం చూపించట్లేదు. హిట్ మీద హిట్టు కొడుతున్న బన్ని సినిమాలో కంటెంట్ ఉన్నా లేకున్నా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను సాధించాడు.  సూర్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర డల్ అయ్యాడు.


సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి, డీజే ఇలా అన్ని ఆ కోవలో హిట్ అయినవే. అయితే నా పేరు సూర్య కూడా ముందు టాక్ బాగాలేకున్నా సరే కలక్షన్స్ మాత్రం డల్ గా ఉన్నాయి. ఎంతగా అంటే విశ్లేషకులు ఈ సినిమాను బన్ని కెరియర్ లో భారీ డిజాస్టర్ అయిన వరుడు సినిమాతో పోల్చేంత. అయితే మరి అంత దారుణంగా సినిమా లేదు కాని బన్ని రేంజ్ కు తగినన్ని కలక్షన్స్ రావట్లేదని అలా అంటున్నారు.  


ఈ సినిమా ఫలితంతో బన్ని మరోసారి పునరాలోచన చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం విక్రం కుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న బన్ని లింగుస్వామి డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ కూడా ప్లాన్ చేశాడు. మరి సూర్య నిరాశ పరచింది కాబట్టి తర్వాత సినిమాల ప్లాన్స్ లో ఏదైనా తేడా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: