తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతంది ‘మహానటి’ సినిమా. మొదట మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ఓ బయోపిక్ తీయబోతున్నారంటే ఎవ్వరూ నమ్మలేదు..అయినా సినీ తారలపై బయోపిక్ అంత ఆశామాశీ వ్యవహారం కాదని ఎద్దేవా చేశారు.  కానీ వీటన్నింటికి చెక్ పెడుతూ..దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ తెరపైకి తీసుకు వచ్చి ఔరా అనిపించాడు. 
Related image
అయితే మహానటి సావత్రి లా నటించి మెప్పించడం అనేది ఈ తరం హీరోయిన్లకు సాధ్యం కాదని స్వయంగా ఒప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి..కేవలం కళ్లతోనే హావభావాలు పలికించి రక్తి కట్టించగల గొప్ప నటి సావిత్రి.  అలాంటి పాత్రలో నటించాలంటే..కొంతైనా ఆమెలా ప్రవర్తించడం..నటించడం చేయాలి..అందుకు ఏ హారోయిన్ అయినా కాస్త ఆలోచించాలి..ఇదే ఆలోచన నటి కీర్తి సురేష్ కి వచ్చిందట.
Image result for mahanati posters
ప్రస్తుతం ‘మహానటి’ మంచి సక్సెస్ తో సాగుతున్న సందర్భంగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..   తెలుగు ప్రేక్షకులు మహానటి సావిత్రిని దేవతలా కొలుస్తారని, అటువంటి పాత్రను తాను పోషించడానికి ముందు ఎంతో సందేహించానని చెప్పింది. అయితే, సవాల్ గా తీసుకుని ఆ పాత్రలో నటించానని, ఈ పాత్ర కోసం తాను బరువు పెరగలేదని, నిజం చెప్పాలంటే, సావిత్రి చిన్ననాటి పాత్ర కోసం కొంచెం బరువు తగ్గాల్సి వచ్చిందని పేర్కొంది.
Image result for mahanati posters
సావిత్రి పెద్దయ్యాక చేసిన పాత్రలను తాను పోషించేందుకు ప్రోస్థటిక్ పద్ధతిలో తనకు మేకప్ వేసేవారని, మూడు గంటల సమయం పట్టేదని చెప్పింది. ఆ మేకప్ ను తిరిగి తీసి వేసేందుకు మరో మూడు గంటల సమయం కేటాయించాల్సి వచ్చేదని చెప్పిన కీర్తి సురేశ్, కేవలం తన కనుబొమ్మలను తీర్చిదిద్దేందుకే అరగంట సమయం పట్టేదని గుర్తుచేసుకుంది. సెట్స్ పైకి వెళ్లగానే ఆ కష్టమంతా మర్చిపోయి పాత్రపై, నటనపై దృష్టి పెట్టేదానినంటూ చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: