తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలుగులో నకిలీ, డాక్టర్ సలీమ్ లాంటి సినిమాలతో వచ్చాడు. కానీ అవి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు..‘బిచ్చగాడు’ సినిమాతో విజయ్ ఆంటోనీ స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా బాగానే నడిచాయి.  త్వ‌ర‌లో విజయ్ ఆంటోనీ ‘కాశి’గా ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
Image result for vijay antony kaasi movie stills
సునయన, అంజలి హీరోయిన్లుగా.. కిరుతుగ ఉదయనిధి దర్శ‌కత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ తొలి ఏడు నిమిషాల సినిమాను మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాటిమా విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘కాశి’ తొలి ఏడునిమిషాల సినిమాను బట్టి ఈ మూవీలో మరోసారి మ‌ద‌ర్ సెంటిమెంట్ చూపించబోతున్నాడు.  యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 18న తెలుగు, తమిళ భాషలలో విడుదల అవుతుంది.
Image result for vijay antony kaasi movie stills
ఇది తమిళంలో “కాళి”గా విడుదల చేయబడుతుంది.తాజాగా ఈ చిత్రంలోని మొదటి 7 నిమిషాల సినిమాను  యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామని ప్రకటించారు చిత్ర బృందం.
Image result for vijay antony kaasi movie stills
ఇది విజయ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పవచ్చు. దీన్నిబట్టి నిర్మాతలు సినిమా విజయం సాధిస్తుందని ఎంతగా నమ్మకంగా పెట్టుకున్నారో అర్థమవుతోంది. గతంలో కూడా బేతాళుడు సినిమా ఇలాగే రిలీజ్ చేశారు.  కానీ అది మాత్రం అనుకున్న విజయం సాధించలేక పోయింది.  మరి ఈ సారి ‘కాశి’ బిచ్చగాడు స్థాయిలో రికార్డు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: