నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇన్నాళ్లు మాస్ అండ్ కమర్షియల్ సినిమాలనే చేస్తూ వచ్చాడు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అలా నడిచాయి. అయితే కెరియర్ లో కొత్త టర్న్ తీసుకునేందుకు ఇదే కరెక్ట్ అనుకున్నాడో ఏమో కాని కళ్యాణ్ రామ్ లవర్ బోయ్ గా సరికొత్త అవతారం ఎత్తేశాడు. అది కూడా మిల్కీ బ్యూటీ తమన్నా కోసం ఈ నందమూరి హీరో లవర్ గా మారాడు. 


జయేంద్ర డైరక్షన్ లో కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా నా నువ్వే. ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ లవర్ బోయ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. టీజర్ తో సినిమాపై క్రేజ్ తీసుకురాగా ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హోప్ ఏర్పడేలా చేసింది. యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన జయేంద్ర 180 సినిమా తర్వాత చేస్తున్న సినిమా నా నువ్వే.    


రేడియో జాకీ అయిన తమన్నా కళ్యాణ్ రాం ను ప్రేమిస్తుంది. వెంట పడుతుంది ప్రేమిస్తుంది.. అయినా సరే అతన్ని ఇంప్రెస్ చేయలేదు. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ అయితే ఇంప్రెస్ చేసింది. పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


శరత్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ఇంప్రెస్ చేసేలా ఉంది. తమన్నా అందాలు హైలెట్ గా వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఆమె కెరియర్ కు చాలా ఇంపార్టెంట్ అవనుంది. మరి కళ్యాణ్ రాం, తమన్నాలు కలిసి మొదటిసారి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: