బిగ్ బాస్ హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ చేశాడు. స్టార్ మా ప్రెస్టిజియస్ గా ఇంట్రడ్యూస్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. ముఖ్యంగా తారక్ హోస్టింగ్ టాలెంట్ బుల్లితెర మీద టి.ఆర్.పి తో దద్దరిల్లిపోయేలా చేసింది.


ఇక ఈ ఇయర్ స్టార్ మా బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు సిద్ధమవుతుంది. ఈ సీజన్ కు ఎన్.టి.ఆర్ దూరంగా ఉంటున్నాడని తెలియగా రేసులోకి రానా, బన్ని, నాని వచ్చారు. ఫైనల్ గా నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్2 హోస్ట్ గా చేస్తున్నాడని తెలిసిందే. అయితే అఫిషియల్ గా ఎనౌన్స్ మాత్రం చేయలేదు.


నాచురల్ స్టార్ గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని బిగ్ బాస్ తో బుల్లితెర మీద కూడా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రోగ్రాం కోసం నాని దాదాపు 4 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ కు 7 కోట్ల దాకా ఇచ్చిన స్టార్ మా నాని కోసం 4 కోట్లకు ఫిక్స్ చేశారట.


జూన్ నుండి మొదలుకాబోతున్న ఈ షోలో క్రేజీ సెలబ్రిటీస్ పార్టిసిపేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే లీక్ అయిన లిస్ట్ క్రేజ్ సంపాదించగా వారు కాకుండా మరికొంతమంది ఈ షోలో పాల్గొననున్నారట. మొదటి సీజన్ 70 రోజులు జరుగగా బిగ్ బాస్ సెకండ్ సీజన్ 100 రోజుల పాటు సాగుతుందని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: