కింగ్ నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సెకండ్ ప్రయత్నంగా వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో కూడా హిట్ కొట్టాడు. తన 3వ ప్రయత్నంగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నేల టిక్కెట్టు సినిమా చేశాడు కళ్యాణ్ కృష్ణ.


రవితేజ మార్క్ మాస్ అంశాలను ఏమాత్రం మిస్ కానివ్వకుండా మంచి కథతో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. టీజర్, ట్రైలర్ రవితేజ సినిమాలో ఉండాల్సిన మసాలాలన్ని ఉన్నాయనిపిస్తుండగా సినిమా రవితేజకు పక్కా హిట్ ఇస్తుందని అంటున్నరు మాస్ రాజా ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆడియో రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై అందరికి ఆసక్తి మొదలైంది.


రాం తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో మాళవిక శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇక ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.


మే 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెన్సార్ నుండి పాజిటివ్ రివ్యూనే వచ్చినట్టు తెలుస్తుంది. మరి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటం బాక్సాఫీస్ పై రవితేజ సత్తా చాటుతాడా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: