తెలుగులో ప్రస్తుతం దూసుకెళ్తున్న యాంకర్లలో జబర్దస్త్ యాంకర్ రష్మి ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ సరైన అవకాశాలు, గుర్తింపు తగిన పాత్రలు లేక చాలా శ్రమలే పడింది. అయితే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ అనే కామెడీ షోకు యాంకర్ గా చేస్తున్నప్పటినుండి ఆమె దశ, దిశ తిరిగిందని చెప్పవచ్చు. గుంటూరు టాకీస్ వంటి హాట్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ మంచి గుర్తింపును పొందింది.


సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మి తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్న కాస్టింగ్ కౌచ్ వివాదం గురించి ట్విట్టర్లో స్పందిస్తూ అసలు సెక్స్ వర్కర్ పాత్రలో కూడా నటిస్తే తప్పేంలేదు, అది ఒక ఛాలెంజింగ్ రోల్ అంటు రాసుకొచ్చిన రష్మి  స్టార్ హీరోయిన్ అనుష్క సైతం వేదం సినిమాలో వేశ్యగా నటించిందన్న విషయం మరోమారు గుర్తుచేసింది.


అయితే ఆమె ఈ ట్వీటు చేసి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆమె వేశ్య పాత్రలో మళ్ళీ  ఘాటుగా నటించబోతునట్లు వార్తలు వస్తున్నాయి. కిరణ్ అనే యువ దర్శకుడు వివరించిన కథలో సినిమా ముఖ్య ఉద్దేశ్యం నచ్చడం వల్ల సినిమా మొత్తం సాగే వేశ్య పాత్రలో  నటించడానికి అంగీకరించిందని గుసగుసలు వినపడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: