సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య తన సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు..సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ.  ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై తనదైన మార్క్ చాటుకుంటూ..ఏదో ఒక వివాదానికి నాంది పలుకుతున్నారు.  ఈ మద్య పవన్, రవితేజపై సంచలన ట్విట్ చేసి ఫ్యాన్స్ చేత చివాట్లు తిన్నారు.  ఆ మద్య శ్రీరెడ్డి విషయంలో తలదూర్చి టాలీవుడ్ పెద్దల చేత నానా తిట్లు తిన్నారు.  ఒకదశలో టాలీవుడ్ లో పెను సంచలనమే చెలరేగింది. 
Image result for varma pawan
మెగా ఫ్యామిలీ వర్మ మద్య భారీ స్థాయిలో సోషల్ మీడియాలో యుద్దమే అయ్యింది.  ఇది కాక నాగార్జున హీరోగా ‘ఆఫీసర్’ సినిమా విషయంలో కూడా ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్నారు రాంగోపాల్ వర్మ.   

మరోవైపు ఈ సినిమా కథ తనదే అంటూ ఓ యువకుడు నానా హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న అరవింద్ సమేత.. వీర రాఘవ టైటిల్ అనౌన్స్‌మెంట్, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. టైటిల్‌ను ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
Image result for ntr trivikram
అంతే వెంటనే దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించారు. వావ్.. తారక్ ఎప్పుడూ కనిపించనంతగా సెక్స్ కంటే మిన్నగా ఇప్పుడు సెక్సీగా కనిపిస్తున్నాడు అని వర్మ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో చేసిన వర్మ ట్వీట్‌కు మంచి స్పందన లభిస్తున్నది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: