జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న శనివారం అర్ధరాత్రి ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ ఇంటి వద్ద హడావిడి చేశారు. తెలుగులో భారీ ఫాలోయింగ్ కలిగిన వారిలో ఎన్.టి.ఆర్ ఒకరు. అతని ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్స్ వద్ద చూస్తూనే ఉంటాం.


ప్రస్తుతం తారక్ బర్త్ డే నాడు మిడ్ నైటే అతన్ని విష్ చేయాలని ఫ్యాన్స్ అంతా మూకుమ్మడిగా తారక్ ఇంటిముందు బారులు తీరారు. ఇది ఊహించని ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఇచ్చిన సర్ ప్రైజ్ కు షాక్ అయ్యాడు. ఎన్.టి.ఆర్ ఒక్క సైగ కోసం ఫ్యాన్స్ గంటల పాటు ఎదురుచూశారట. చివరకు ఎన్టీఆర్ వారిని కలిసాడు. ఇక నిన్న సాయంత్రమే ఫ్యాన్స్ కు తన సినిమా ఫస్ట్ లుక్ తో క్రేజీ గిఫ్ట్ ఇచ్చాడు ఎన్.టి.ఆర్.  


త్రివిక్రం తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్న తారక్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. మాస్ లుక్ లో ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 


తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి బర్త్ డే కానుకగా వచ్చిన మోషన్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఎన్.టి.ఆర్, త్రివిక్రం క్రేజీ కాంబినేషన్ పై ఉన్న అంచనాలన్ని ఈ సినిమా ఫస్ట్ లుక్ తో మరింత పెంచేశారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: