‘సీతాకోక చిలుక’ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అలీ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించారు.  అప్పటి వరకు కమెడియన్ గా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన అలీ..ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘యమలీల’ లో హీరోగా నటించే అవకాశం ఇచ్చారు.  ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అలీ పలు సినిమాల్లో హీరోగా నటించారు.  హీరోగా నటించినా..తాను మాత్రం ఎప్పటికీ పొంగి పోకుండా మళ్లీ కమెడియన్ పాత్రల్లోనే నటించారు. 

ఈ మద్య టెలివిజన్ రంగంలో కూడా తన సత్తా చాటుతూ వచ్చారు.   ఆడియో వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం వెండితెరపై నటిస్తూనే..బుల్లి తెరపై యాంకర్ గా  బిజీగా కొనసాగుతున్నారు.  ఈ మద్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ..నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు .. ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ వుంటాను. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను .. పుట్టిన ఊరును ఎప్పటికీ మరచిపోను.
Image result for actor ali yamaleela
సాధించిన విజయాలను కాలుమీద కాలేసుకుని చెప్పుకునే అలవాటు నాకు లేదు. మా ఫాదర్ ఒక టైలర్ .. ఆ రోజుల్లో నిజంగానే ఆయన గొప్ప టైలర్. భరతనాట్యం .. కూచిపూడి .. కథాకళికి సంబంధించిన డ్రెస్ లు అప్పట్లో అక్కడ మా ఫాదర్ ఒక్కరే కుట్టేవారు. అప్పట్లో ఫోర్ పీస్ సూట్లు కుట్టడంలో మా నాన్న సిద్ధహస్తుడు.

అది చాలా కష్టమైన పని .. అందులో మా ఫాదర్ కి మంచి నైపుణ్యం ఉండేది.  అదే సమయంలో నాకు కూడా కొన్ని సూట్స్ కుట్టేవారు..నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు..సినిమాలు అంటే పిచ్చని ఆయనకు కూడా తెలుసు.  నేను సూట్ లో ఉంటే మా నాన్న ఎంతో సంతోషంగా చూసేవారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: