ఈ మద్య టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా బాగా పెరిగిపోయింది.  ఇక నాగ్ శౌర్య ఈ మద్య వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు.  తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ప్రేమ కథా చిత్రాల కన్నా కుటుంబ కథా నేపథ్యంలో వచ్చే సినిమాలు అద్భుత విజయం సాధిస్తున్నాయి.  ఇదే ట్రెండ్ కొనసాగిస్తు ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా మనుషుల మద్య ప్రేమానురాగాలు...కుటుంబ విలువలు తెలిపే విధంగా ఉండబోతుందట. సుందర్ సూర్య దర్శకత్వం వహించారు.

శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది.  ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ పూర్తి కావడంతో ముందుగా అనుకున్నట్లుగానే ఈనెల 25న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. తమ బాల్యాన్ని గుర్తుచేశామని చాలా మంది కామెంట్లు చేశారు.

తాజాగా మా సినిమా సెన్సార్ ప‌నుల‌ను పూర్తిచేసుకుంది. అంతే కాదు ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డు సభ్యులు కూడా చాలా సంతోషించారట..అందుకే  ఒక్క క‌ట్ కూడా లేకుండా సెన్సార్ బృందం క్లీన్ ‘యు’ స‌ర్టిఫికెట్ జారీ చేసింది.

చ‌క్కని కుటుంబ క‌థా చిత్రం తీశార‌ని.. భావాలు, భావోద్వేగాలు హృద‌యాన్ని హ‌త్తుకున్నాయ‌ని సెన్సార్ టీమ్ ప్రశంసించ‌డం చాలా ఆనందంగా ఉంది. కుటుంబ స‌మేంతంగా చూడ‌ద‌గ్గ సినిమా అని మెచ్చుకున్నారు. ఈనెల 25న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులంద‌రికీ మా సినిమా త‌ప్పకుండా న‌చ్చుతుంది’ అని నిర్మాత రాజేష్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: