చిన్న సినిమాలకు యూత్ ఫాలోయింగ్ ఉండాలి అంటే ఇంటిమేట్ సీన్స్ కంపల్సరీ అన్నది తెలిసిందే. కంటెంట్ ఉన్న సినిమాలకైతే ఇక ఆ డోస్ ఎక్కువే అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా అందుకు ఉదాహరణ. ఆ సినిమా పోస్టర్స్ లో కూడా లిప్ లాక్ సీన్స్ వేశారు. 


ఇక ఇప్పుడు ఆ సినిమా పంథాలోనే ఓ ఎమోషనల్ మూవీగా రాబోతున్న సినిమా ఆరెక్స్ 100. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఈ ఇద్దరి రొమాన్స్ మసాలా ఘాటు అదిరిపోయిందని చెప్పాలి. ఎంతగా అంటే జస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునేలా అన్నమాట.


అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ ఇంటిమేట్ సీన్స్ అయితే కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ అబ్బో సినిమాకు యూత్ క్యూ కట్టేందుకు సరిపడా సరుకు ఉందని ట్రైలర్ లోనే అర్ధమవుతుంది. మెయిన్ గా కుర్రాళ్ల టార్గెట్ తోనే ఈ సినిమాలో ఈ రేంజ్ లో హాట్ సీన్స్ పెట్టారని చెప్పొచ్చు.


ట్రైలర్ చూసిన యూత్ ఆడియెన్స్ మరో అర్జున్ రెడ్డి అంటున్నారు. ఇందులో అర్జున్ రెడ్డితో హీరోయిన్ ను పోల్చడం విశేషం. చిన్న సినిమా అయినా ట్రైలర్ తో ఆడియెన్స్ లో ఓ క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా పాయల్ అందాలను సూపర్ గా వాడేశారని తెలుస్తుంది. మరి ఇంత చేసినా సినిమా ఫలితం ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: