డిఎస్పి.. మ్యూజిక్ రాక్ స్టార్.. ఆయన పాటల ఆడియో అంటే ఆటోమేటిక గా ఓ మేజిక్ వర్క్ అవుట్ అవుద్ది. ఏ హీరో సినిమా అయినా దేవి మ్యూజిక్ అంటే సినిమా సగం హిట్ అన్నట్టే. ఈ లెక్కలన్ని డిఎస్పి క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం సౌత్ లో టాప్ 1 లో ఉన్న మ్యూజిక్ మిరకిల్ డిఎస్పి. 


అయితే ఇదంతా ఒక సైడ్ అయితే.. దేవి శ్రీతో మ్యూజిక్ అంటే తలనొప్పే.. స్టార్ డైరక్టర్స్ కు ఏమో కాని యువ దర్శకులైతే తను చెప్పిందే టైం.. తను చేసిందే ట్యూన్. ఇలా ఉంటుందట పరిస్థితి అయ్యో ఇందులో మనం కల్పించి రాసింది ఏమి లేదండి బాబు ఇదంతా ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్న మాటే.


దేవి సినిమాతో మ్యూజిక్ డైరక్టర్ గా మారిన డిఎస్పి తన మార్క్ మ్యూజిక్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కుర్ర వయసులోనే మ్యూజిక్ డైరక్టర్ అవడంతో ఇప్పటికి ఆ జోష్ తగ్గలేదు. దేవి ఇప్పటికే యంగ్ గానే ఉన్నడు కాబట్టి తన పాటలు కూడా అలానే ఉన్నాయి. అయితే దర్శకులతో దేవి డిమాండ్ ఈమధ్య బాగా ఎక్కువైందట.


తనతో సినిమా అంటే తాను చెప్పిన చోటే పాట రావాలని.. తను ఇచ్చిన ట్యూనే తీసుకోవాలని.. తను చెప్పిన లిరిక్ రైటర్ తోనే పాట రాయించాలని ఇలా బోలెడన్ని డిమాండ్స్ ఉన్నాయట. తన పాట ఎవరితో పాటిస్తాడన్నది తన ఇష్టమే అట. ఎలాగు సంగీత దర్శకుడు కాబట్టి ఆ ఒక్కటి వదిలేయొచ్చు కాని మిగతా ఎక్స్ ట్రాలన్ని దర్శకులకు నచ్చట్లేదు. అందుకే ఈమధ్య రామ్ సినిమా నుండి దిల్ రాజు దేవిని పక్కకు పెట్టాడు. అఫిషియల్ గానే క్రియేటివ్ డిఫరెన్సెస్ అని ఎనౌన్స్ చేశారు. అంటే దేవి కెలుకుడు వారికి నచ్చకనే పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలన్ని తన ఇమేజ్ కు డ్యామేజ్ చేస్తాయి కాబట్టి దేవి శ్రీ ప్రసాద్ కాస్త ఆలోచించుకుంటే బెటర్.   



మరింత సమాచారం తెలుసుకోండి: