ఇండస్ట్రీలో ఈమధ్య యువకుల ఉత్సాహం బాగా జోరందుకుంది. ఒకప్పుడు అసలు కథలే లేవని చెప్పగా ఇప్పుడు కాంబినేషన్ కో కథ సెట్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్య క్రేజీగా మారిన మల్టీస్టారర్ స్టోరీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాహుబలి తర్వాత రాజమౌళి మెగా నందమూరి కాంబినేషన్ సెట్ చేయగా మరో పక్క ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ అనీల్ రావిపుడి వెంకటేష్, వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు.


ఇక ఈ రెండే కాకుండా సెట్స్ మీద ఉన్న నాగార్జున, నానిల సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదే కాకుండా వెంకటేష్ మేనళ్లుడు నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కథ జనార్ధన మహర్షి అందిస్తున్నారట. వెంకటేష్ కు లైన్ చెప్పగా అదిరిపోయిందని అన్నాడట. 


ఇక అల్లుడు నాగ చైతన్య కూడా ఓకే చెప్పేయడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. బాబి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. రియల్ లైఫ్ లో లానే సినిమాలో కూడా మేనమా మేనళ్లుడు లానే వెంకటేష్, నాగ చైతన్య కనిపిస్తారట. ప్రస్తుతం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ షూటింగ్ లో ఉన్న వెంకటేష్ ఆ సినిమా పూర్తి చేశాక ఈ మల్టీస్టారర్ చేస్తాడట.


నాగ చైతన్య కూడా సవ్యసాచి రిలీజ్ కు రెడీ అవుతుండగా మారుతి డైరక్షన్ లో చేస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఇయర్ మామతో పాటుగా సోలో సినిమాలతో అక్కినేని హీరో హంగామా చేస్తాడని అనిపిస్తుంది. సమంత మ్యారేజ్ తర్వాత చైతులో కొత్త జోష్ వచ్చిందని అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: