రచయితగా ఉంటూ దర్శకులుగా మారిన వారికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. వారిలో ప్రస్తుతం మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ సినిమా లెక్క గురించి తెలిసిందే. తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక సందర్భంలో సమాజానికి ఓ మంచి చేకూరే విధంగా మెసేజ్ ఇస్తున్న కొరటాల శివ భరత్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.


ఇక తన తర్వాత సినిమా ఎవరితో తీయాలా అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్న కొరటాల శివకు మెగాస్టార్ నుండి లక్కీ ఛాన్స్ వచ్చింది. భరత్ అనే నేను సినిమా చూసిన చిరంజీవి స్పెషల్ గా కొరటాల శివకు కాల్ చేసి విష్ చేయడం తెలిసిందే. ఇక ఈ క్రమంలో కొరటాల శివ తర్వాత సినిమా చిరంజీవితోనే చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.


ఆ వార్తలపై ఇప్పటిదాకా ఎలాంటి క్లూ దొరకలేదు కాని కొరటాల శివ మాత్రం చిరంజీవికి తగినట్టుగా కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లోనే మొదలవనుందని తెలుస్తుంది. తన దగ్గర ఉన్న ఓ లైన్ ను చిరుకి వినిపించగా ఓకే చెప్పడంతో కొరటాల శివ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడట.


మొత్తానికి మహేష్ సినిమా సక్సెస్ తో కొరటాల శివ చిరుతో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ సైరా షూటింగ్ లో ఉన్నారు. ఆ సినిమాను అక్టోబర్ కల్ల పూర్తి చేసి కొత్త సినిమా మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. మరి ఈ మెగా కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందో ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: