ఈ మధ్య సినిమాలకు రివ్యూ చెప్పే వ్యక్తులు ఎక్కువయ్యారు. థియేటర్ నుండి బయటకు రాగానే పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు మైకులు పట్టుకొని సినిమా చూసిన వ్యక్తుల అభిప్రాయాన్ని సేకరించి వ్యూస్ కోసం పాకులాడుతుంటే , ఇక కొంతమంది ప్రేక్షకులైతే ఎలాగైనా పాపులర్ అవ్వాలి అనే ఉద్దేశంతో తమకు తోచినట్లు మాట్లాడేసి రివ్యూలు ఇచ్చి పడేస్తుంటారు.


ఇలానే మహేష్ అలియాస్ నెటిజన్లు పెట్టుకున్న పేరు పిట్టలదొర అనే వ్యక్తి ప్రతిఒక్క సినిమా రివ్యూను కాస్త ఫన్నీ గా చెబుతూ ఇంటర్నెట్లో ఫేమస్ అయ్యాడు. అప్పటిలో ఈయన ఆ! సినిమాకు  రివ్యూ ఇవ్వగా ఇది చాలా ఫన్నీగా ఉంది అని నాని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. కాగా ఈయన ఎప్పటిలాగే నేల టిక్కెట్ సినిమా చూసి థియేటర్ బయటున్న యూట్యూబ్ చానెళ్లకు రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 


ఇంతలోనే ఒక యూట్యూబ్ ఛానెల్ కు చెందిన ప్రతినిథి అసలు అతను సినిమానే చూడలేదని, చూడకుండా చెత్త రివ్యూ ఇస్తున్నాడని చెప్పి అతని టిక్కెట్ చూపించమని దౌర్జన్యానికి దిగాడు. దీనితో మహేష్ భయపడిపోతూ తాను సినిమా చూశానని, కావాలంటే ఈ టిక్కెట్టు చూపిస్తానని చెపుతున్నా టిక్కెట్టు చూపించమని ప్రతినిథి అతనిపై ఫైర్ అయ్యాడు.  దీంతో సినిమా చూసిన  ఒకతను కల్పించుకొని అతను సినిమాకు వచ్చాడు, నేను చూశాను అని చెప్తున్నా ప్రతినిథి వినిపించుకోకపోవడంతో అక్కడ కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఇంతలో థియేటర్ యాజమాన్యం కల్పించుకుని  పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: